: కర్నూలు-కాచిగూడ ప్యాసింజర్ రైలును ఆపేశారు!
కర్నూలు నుంచి కాచిగూడ (హైదరాబాద్) వెళ్లాల్సిన ప్యాసింజర్ రైలును అధికారులు మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో ఆపివేశారు. ఉదయం 8.15 గంటలకు మహబూబ్ నగర్ కు రావాల్సిన రైలు మూడు గంటలు ఆలస్యంగా 11 గంటలకు చేరుకుంది. మరమ్మతులు చేయాల్సి రావడంతో రైలును మహబూబ్ నగర్ లో నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. దీంతో ప్రయాణీకులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా నిలిపివేయడమేమిటని స్టేషన్ మాస్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. గుంతకల్లు-కాచిగూడ ప్యాసింజర్ రైలులో వెళ్లాలని అధికారులు ప్రయాణికులకు సూచించడంతో వారు ఆందోళనను విరమించారు.