: ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తానని కేసీఆర్ మాట ఇచ్చారు... మర్చిపోయారా?: ఔట్ సోర్సింగ్ కార్మికులు


హైదరాబాదులోని విద్యుత్ సౌధలో తెలంగాణ ఔట్ సోర్సింగ్ కార్మికుల ఆందోళన రెండో రోజు కొనసాగుతోంది. గుత్తేదారుల వ్యవస్థను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమకు నేరుగా బోర్డు నుంచి వేతనాలు చెల్లించాలంటూ వారు నిరసనకు దిగారు. యాజమాన్యం దిగొచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని పలు సంఘాల ప్రతినిధులు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే కార్మికుల ఉద్యోగాలను క్రమబద్ధీకరించే ఫైలుపై సంతకం చేస్తానని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News