: ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన నేతలు


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి శాసనసభ్యులుగా ఎన్నికైన నేతలంతా ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా అధికార పార్టీకి చెందిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అనంతరం ప్రతిపక్ష పార్టీకి చెందిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత డిప్యూటీ ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, మంత్రులు అయ్యన్నపాత్రుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస్, మృణాళిని, కొల్లు రవీంద్ర, పీతల సుజాత, రావెల కిషోర్ బాబు, మాణిక్యాలరావు, పల్లె రఘునాథరెడ్డి తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది.

  • Loading...

More Telugu News