: అవన్నీ పుకార్లేనంటున్న ప్రీతీ జింతా


నెస్ వాడియాతో వివాదం నేపథ్యంలో బాలీవుడ్ నటి ప్రీతీ జింతా తనపై వస్తున్న పుకార్లకు తెరదించే ప్రయత్నం చేసింది. ఐపీఎల్ లో వాటాలు విక్రయించి, అమెరికాలో స్థిరపడనున్నట్టు తనపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేసింది. ఈ మేరకు ట్విట్టర్లో తన స్పందనలు పంచుకుంది. ప్రచారం చేయదలుచుకుంటే భారత్ లో ఇంతకంటే మంచి విశేషాలు ఉన్నాయని మీడియాకు హితవు పలికింది.

  • Loading...

More Telugu News