: బియాస్ నదిలో మరో మృతదేహం లభ్యం
లార్జీ డ్యాం పరిధిలో బియాస్ నదిలో గల్లంతైన తెలుగు విద్యార్థుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం 24 మంది గల్లంతవగా, నిన్నటి వరకు 10 మృతదేహాలు లభ్యమయ్యాయి. నేటి ఉదయం మరో మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ మృతదేహం ఎం.శివప్రకాశ్ వర్మదిగా గుర్తించామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు.