: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మాజీ మంత్రి బాలరాజు
గిరిజన సంక్షేమ శాఖ మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో విశాఖ డీసీసీ అధ్యక్షుడు పి. సతీష్ వర్మ కూడా గాయపడ్డారు. ఈ ఘటన విశాఖ జిల్లా నాతవరం మండలం ములగపూడి వద్ద జరిగింది. గాయపడ్డ వీరిని నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో ఓ వివాహవేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ రోజు తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది.