: రేపట్నుంచి అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు
రేపట్నుంచి ఈ నెల 25 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలను అమలు చేయనున్నారు. అసెంబ్లీకి 2 కిలోమీటర్ల పరిధిలో ర్యాలీలు, సమావేశాలు, సభలు నిర్వహించుకోవడానికి వీల్లేదని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతేకాకుండా, అసెంబ్లీ పరిసరాల్లో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.