: ఇరాక్ లో 10 వేల మంది భారతీయులు...600 మంది తెలంగాణ వారు


అంతర్యుద్ధంతో అల్లాడుతున్న ఇరాక్ లో 10 వేల మంది భారతీయులు ఉన్నారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. వారిలో 600 మంది తెలంగాణకు చెందిన వారని వెల్లడించింది. ఇరాక్ లో భారత ఎంబసీని మూసివేసే ప్రశ్నే లేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి భారతీయులంతా క్షేమంగా ఉన్నారని, వారిని ఇరాక్ విడిచి భారత్ చేరాల్సిందిగా ఆదేశించామని విదేశాంగ శాఖ తెలిపింది.

భారతీయుల భద్రతకు కట్టుబడి ఉన్నామని విదేశాంగ శాఖ వెల్లడించింది. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో, ఇరాక్ లోని భారత రాయబారి సురేష్ రెడ్డి హుటాహుటిన ఇండియా నుంచి బయలుదేరి ఇరాక్ వెళ్లారు. తెలంగాణ వాసులను క్షేమంగా రప్పించేందుకు భారత దౌత్య కార్యాలయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు.

భారతీయుల సంక్షేమానికి, సహాయ సహకారాలు అందించేందుకు ఢిల్లీలో విదేశీ వ్యవహారాల శాఖ కంట్రోల్ రూం ప్రారంభించింది. +91 11 2301 2113, +91 11 2301 7905, +91 11 2301 4104 Email: controlroom@mea.gov.in, దానితో పాటే బాగ్దాద్ లోని భారతీయ దౌత్య కార్యాలయాన్ని సంప్రదించేందుకు +964 770 444 4899, +964 770 484 3247 ఫోన్ చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News