: మోడీకి ఎస్ఓఎస్ పంపిన ఇరాక్ లోని భారత నర్సులు


ఇరాక్ అంతర్యుద్ధం అక్కడి భారతీయుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తిక్రిత్ పట్టణంలోని ఓ ఆసుపత్రిలో 46 మంది భారత నర్సులు చిక్కుకుపోయారు. వారు తమ పరిస్థితిని వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ అత్యవసర సందేశం (ఎస్ఓఎస్) పంపారు. తిక్రిత్ లో భయానక పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఐఎస్ఐఎల్ రెబెల్స్ పట్టణ వీధుల్లో యథేచ్చగా సంచరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని జోక్యం చేసుకుని తమను ఎలాగైనా స్వదేశం చేర్చాలని వారు తమ సందేశంలో అభ్యర్థించారు. కాగా, నర్సులకు ఎలాంటి ప్రమాదంలేదని, ప్రస్తుతానికి సురక్షితంగానే ఉన్నారని భారత దౌత్యవర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News