: సాకర్ పిచ్చి అంతరిక్షానికీ పాకింది!


బ్రెజిల్ లో జరుగుతున్న సాకర్ వరల్డ్ కప్ ప్రస్తుతం క్రీడా లోకాన్ని ఉర్రూతలూగిస్తోంది. ఎంతలా అంటే, దక్షిణ అమెరికా ఖండంలో టోర్నీ జరుగుతుంటే ఎక్కడో వందల మైళ్ళ ఎత్తున కొలువుదీరిన అంతర్జాతీయ స్పేస్ సెంటర్ (ఐఎస్ఎస్) లోనూ ఫుట్ బాల్ మ్యాచ్ లు చూసేటంత! నాసా ఆస్ట్రోనాట్లు రీడ్ వైజ్ మన్, స్టీవ్ స్వాన్సన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ యూ) వ్యోమగామి అలెగ్జాండర్ గెర్స్ట్ ఇప్పుడు స్పేస్ స్టేషన్ లో ఏం చేస్తున్నారో తెలుసా..! తమ సాధారణ కార్యకలాపాలను సైతం పక్కనపెట్టి ప్రత్యేక స్ట్రీమింగ్ సాయంతో సాకర్ వరల్డ్ కప్ మ్యాచ్ లు వీక్షిస్తున్నారట. నాసా కూడా కాస్తంత మెతక ధోరణితో మధ్యమధ్యలో ఓ పదేసి నిమిషాల పాటు మ్యాచ్ ను చూసేందుకు వెసులుబాటు కల్పిస్తోంది.

  • Loading...

More Telugu News