: ఇరాక్ లో అతిపెద్ద నూనెశుద్ధి కర్మాగారంపై మిలిటెంట్ల దాడులు
ఇరాక్ లో అంతర్యుద్ధం రోజురోజుకీ తీవ్రమవుతోంది. తాజాగా సున్నీ మిలిటెంట్లు బైజీలోని అతిపెద్ద నూనె శుద్ధి కర్మాగారంపై దాడులకు పాల్పడ్డారు. మెషీన్ గన్ లు, మోర్టార్లతో తెల్లవారు జాము 4 గంటలకు మిలిటెంట్లు విరుచుకుపడ్డారు. నిన్ననే ఈ కర్మాగారం నుంచి విదేశీయుల్ని పంపించేశారు. ఇరాక్ ఉత్తర ప్రాంతంలో గత వారం రోజులుగా సున్నీ మిలిటెంట్ల దాడుల నేపధ్యంలో ఈ కర్మాగారాన్ని సీజ్ చేసిన ప్రభుత్వం, భద్రతా సిబ్బందిని పెంచింది. దీంతో మిలిటెంట్లు తెల్లవారుజామున ఈ కర్మాగారంపై దాడులు చేశారని ఉద్యోగులు, భద్రతా సిబ్బంది తెలిపారు.