: వైజాగ్ లో ఐఐటీ, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, ట్రైబల్ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ: గంటా


విశాఖను ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధానిగా తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రతిష్ఠాత్మక ఐఐఎం, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ట్రైబల్ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ వంటి వాటిని విశాఖలో నిర్మించనున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏడు ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలు నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసి, ఉత్తమ విద్యావ్యవస్థను నెలకొల్పుతామని ఆయన తెలిపారు. యూనివర్సిటీల ఏర్పాటుకు భూసేకరణ జరుగుతుందని ఆయన వెల్లడించారు.

భవిష్యత్తులో దేశంలోని విద్యార్థులంతా విద్యకోసం అంధ్రప్రదేశ్ కు వచ్చేలా విద్యావ్యవస్థను తయారు చేస్తామని ఆయన చెప్పారు. అలాగే ఐటీ పరిశ్రమకు కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని ఆయన తెలిపారు. పలు సంస్థలు విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో పలు ప్రాజెక్టులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం అవుతోందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News