: సిమెంటు కంపెనీలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు: రేవంత్ రెడ్డి


సిమెంటు ధరలను పెంచి, కృత్రిమ కొరత సృష్టిస్తే... కంపెనీలపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన మాట్లాడుతూ... గతంలో సిమెంట్ కంపెనీలు కృత్రిమ కొరత సృష్టిస్తే కాంపిటీషన్ కమిషన్ విచారణ చేపట్టి 11 సిమెంట్ కంపెనీలపై రూ.6,500 కోట్ల జరిమానా విధించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ద్వారా సిమెంట్ పరిశ్రమలు, గోదాములపై దాడులు నిర్వహించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News