: షర్మిల గౌరవాన్ని కాపాడుతాం...చట్టాన్ని మార్చైనా ఉక్కుపాదం మోపుతాం: కేటీఆర్
వైఎస్ షర్మిల గౌరవానికి భంగం కలిగేలా సోషల్ మీడియాలో రూమర్లు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపేందుకు అవసరమైతే చట్టాన్ని కూడా మారుస్తామని అన్నారు. షర్మిల నుంచి ఫిర్యాదు అందుకున్న వెంటనే కమిషనరేట్ ఆఫ్ పోలీస్ తో మాట్లాడి స్పందించాలని కోరామన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విషయంలో కూడా చురుగ్గా స్పందించాలని కోరామని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో ప్రముఖుల వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలా దుష్ప్రచారం చేస్తే వారిని చట్టానికి లోబడి శిక్షిస్తామని కేటీఆర్ తెలిపారు.