: ఇరాక్ అస్తవ్యస్తం... భారతీయుల భద్రత ప్రశ్నార్థకం
ఇరాక్ లో మళ్లీ అంతర్యుద్ధం నెలకొంది. దేశంలో అరాచక పరిస్థితులు ప్రబలే సూచనలు కనిపిస్తున్నాయి. ఐఎస్ఐఎల్ తీవ్రవాదులు కీలక పట్టణాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాక్ లో ఉంటున్న భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొంది. మోసుల్ నగరంలో 40 మంది భారతీయులు చిక్కుకుపోయారు. అక్కడి భారతీయులను సంప్రదించలేకపోతున్నామని మన దౌత్య కార్యాలయం నిస్సహాయత వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.