: ప్రీతి జింటా లైంగిక వేధింపులపై కేసు పెట్టలేదట... కొత్త మలుపు


బాలీవుడ్ సినీ నటి, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా గత నాలుగు రోజలుగా నెలకొన్న వివాదాన్ని కొత్త మలుపుతిప్పింది. మీడియాకు, మహిళా సంఘాలకు ఆమె తన న్యాయవాదితో ఝలక్ ఇచ్చారు. ఆమెపై లైంగిక వేధింపులు జరిగాయని, ఆమె తీవ్ర అవమానానికి గురయ్యారని, మహిళా సంఘాలు ఆందోళన చేశాయి. దీంతో నిజానిజాలపై ఆరాతీసి, ఆమెకు న్యాయం జరిగేలా చేస్తామని సాక్షాత్తూ జాతీయ మహిళా కమిషన్ వ్యాఖ్యానించింది.

ఈ దశలో ప్రీతి జింటా న్యాయవాది హితేష్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సహ భాగస్వామి, వ్యాపార వేత్త నెస్ వాడియాపై ప్రీతి జింటా లైంగిక వేధింపుల ఆరోపణలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రీతి జింటాపై నెస్ వాడియా అసభ్య పదజాలం ఉపయోగించి అవమానపరిచాడని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పబ్లిక్ లో అసభ్యకరంగా దూషించారని నెస్ వాడియాపై చేసిన ఫిర్యాదు ఎఫ్ఐఆర్ లో ప్రీతి జింటా పేర్కొన్నారని ఆయన తెలిపారు.

అసభ్య పదజాలంతో దూషించినందువల్లే ప్రీతి జింటా అవమానంగా ఫీలై ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీసు స్టేషన్ లో పిటిషన్ దాఖలు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు నెస్ వాడియాపై ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం కేసు నమోదైందని హితేష్ జైన్ తెలిపారు. ఈ సెక్షన్ కింద నమోదైన కేసు లైంగిక వేధింపుల కిందకు రాదని ప్రీతి జింటా న్యాయవాది వెల్లడించారు.

  • Loading...

More Telugu News