: బీజేపీ ఎఫెక్ట్... అస్సాం, కర్ణాటక గవర్నర్ల రాజీనామా
పదవుల్లో ఉన్న కాంగ్రెస్ గవర్నర్లు అందరూ రాజీనామా చేయాల్సిందేనన్న బీజేపీ ఒత్తిడి మేరకు పలువురు రాజీనామా బాట పట్టారు. ఈ క్రమంలో ముందుగా ఉత్తరప్రదేశ్ గవర్నర్ బీఎల్ జోషీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ వరుసలోనే అసోం గవర్నర్ జానకి వల్లబ్ పట్నాయక్, కర్ణాటక గవర్నర్ హెచ్.ఆర్. భరద్వాజ్ లు తాజాగా రాజీనామాలు చేశారు. మరికొంతమంది చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు.