: నెస్ వాడియాకు బాలీవుడ్ భామలంటే మహా మోజు


బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో గొడవపెట్టుకున్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ సహభాగస్వామి నెస్ వాడియాపై బాలీవుడ్ లో గుసగుసలు ప్రారంభమయ్యాయి. నెస్ వాడియా రాముడు మంచి బాలుడు రకం కాదని అతని గురించి తెలిసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. బాలీవుడ్ భామలంటే నెస్ వాడియాకు మహా మోజని ముంబై మీడియా కోడైకూస్తోంది. ఈ మేరకు పలు కథనాలను ప్రసారం చేసింది. ప్రీతి జింటా, నెస్ వాడియా మధ్య ప్రేమ బంధం ఐదేళ్లపాటు కొనసాగింది.

వీరి స్నేహబంధం కంటే ముందు, తరువాత, మధ్యలో కూడా నెస్ వాడియా బాలీవుడ్ భామలతో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడని అంటున్నారు. తొలుత మనీషా కొయిరాలాతో అత్యంత సన్నిహితంగా మెలిగాడట. ఆ తరువాత ప్రీతి జింటాతో ప్రేమలో పడ్డాడు.

వారిద్దరూ ప్రేమలో ఉండగానే వాడియా మరో నటి లారాదత్తాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడట. రాక్ స్టార్ సినిమాతో ఒక్కసారిగా తారపథంలోకి దూసుకెళ్లిన నర్గీస్ ఫక్రీతో కూడా నెస్ వాడియా రాసుకుపూసుకు తిరిగాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాక్ స్టార్ ప్రీమియర్ షో ముగియగానే కరణ్ జోహార్ పుట్టిన రోజు వేడకులకు నర్గీస్ ఫక్రీ హాజరైంది. అక్కడ సుమారు గంటసేపు నెస్ వాడియాతో నర్గీస్ ఫక్రీ అతుక్కుపోయిందట. ప్రీతి జింటా అదే పార్టీలో ఉన్నా నర్గీస్ ఫక్రీ స్థాయిలో వార్తల్లో నిలవలేదు.

అమీషా పటేల్ అన్నా నెస్ వాడియాకు మహా ప్రీతి అంటున్నారు అతని గురించి తెలిసిన వారు. ప్రీతి జింటాతో విడిపోయిన తరువాత నెస్ వాడియా బిజినెస్ టైకూన్ అయేషా థాపర్ తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడని ముంబైలో అనుకుంటున్నారు.

  • Loading...

More Telugu News