: సికింద్రాబాద్, జైపూర్ మధ్య సూపర్ ఫాస్ట్ రైలు
ఈ నెల 27న సికింద్రాబాద్ నుంచి రాజస్థాన్ లోని జైపూర్ కు సూపర్ ఫాస్ట్ రైలును దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. 02720 నెంబర్ గల రైలు 27న శుక్రవారం ఉదయం 11.55 గంటలకు సికింద్రాబాద్ లో బయల్దేరి 28న మధ్యాహ్నం 2.55 గంటలకు జైపూర్ కు చేరుకుంటుంది. 02719 నెంబర్ గల రైలు 29న ఆదివారం జైపూర్ లో బయల్దేరి మర్నాడు రాత్రి 8.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.