: ఆస్తుల కేసులో సుప్రీంలో జయలలితకు ఎదురుదెబ్బ
ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఎదురుదెబ్బ తగిలింది. తనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జరుగుతున్న విచారణపై స్టే ఇవ్వాలంటూ ఆమె పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో ఈ కేసు విచారణలో జయ వినతి మేరకు సుప్రీం రెండుసార్లు స్టే విధించింది. దాంతో, నిన్నటితో (సోమవారం) స్టే ముగిసింది. ఈ క్రమంలో తమిళనాడు సీఎంపై ఆస్తుల కేసులో బెంగళూరు కోర్టులో విచారణ కొనసాగనుంది.