: కృష్ణా జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
కృష్ణా జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుడ్లవల్లేరు మండల పరిధిలోని ముక్కొల్లు గ్రామంలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో 150 పూరిళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.