: జైరాం రమేశ్ పై మండిపడ్డ దేవినేని నెహ్రూ


విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ పై దేవినేని నెహ్రూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తిని రాష్ట్రానికి పంపారన్నారు. జైరాం వ్యవహార శైలి సీమాంధ్రులకు నచ్చలేదన్నారు. నాయకులనే నోరు మూసుకోమనడం చులకన చేసిందన్న నెహ్రూ... అందుకే ఏపీ ప్రజలు ఎన్నికల్లో తమ సత్తా చూపి ఘోరంగా ఓడించారని విమర్శించారు. రాయపాటి, పురంధేశ్వరి, లగడపాటిలు ఏం చేశారో అందరికీ తెలుసునని... కొందరు మాజీ, కేంద్ర మంత్రులను అసలు క్షమించరాదన్నారు.

  • Loading...

More Telugu News