: వాన చినుకుల కోసం ఎదురుచూపులు... ‘పశ్చిమ’లో ప్రత్యేక పూజలు
జూన్ మాసం ద్వితీయార్థం వచ్చినా వర్షాలు కురవకపోవడంతో... పశ్చిమగోదావరి జిల్లాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉంగుటూరు మండలం నారాయణపురంలోని కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి ఆలయంలో సహస్రనామ గంగార్చన పూజలను ఇవాళ ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని గోదావరి జలాలతో పరమశివునికి అభిషేకం చేశారు. ఆలయ ఛైర్మన్ అప్పారావు ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి.