: సౌదీ అరేబియాలో కన్నుమూసిన ఖమ్మం వాసి
బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లిన ఖమ్మం వాసి అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఖమ్మం జిల్లా గార్ల మండలంలోని ముల్కనూరు గ్రామానికి చెందిన మజీబ్ పాషా రియాజ్ లో డ్రైవరుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. యజమాని కొట్టడం వల్లే అతడు చనిపోయాడని మృతుని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని భారత్ కు తరలించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.