: అంజలి నా దత్తత కూతురు: నోరు విప్పిన పిన్ని
కుటుంబ వివాదాలతో చిక్కుల్లో పడ్డ సినీ కథానాయిక అంజలి పిన్ని భారతీ దేవి స్పందించారు. 15ఏళ్ల క్రితమే అంజలిని చట్ట ప్రకారం దత్తత తీసుకున్నామని ఆమె చెప్పారు. అంజలి తన అక్క కూతురు అని వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఒక టీవీ చానల్ తో మాట్లాడారు.
అంజలిని వేధించలేదని, కన్నకూతురు కంటే ఎక్కువగా చూసుకున్నామని చెప్పారు. షాపింగ్ మాల్ చిత్రం తర్వాత అంజలి ప్రవర్తనలో మార్పు వచ్చిందన్నారు. అంజలి పారితోషికం 20లక్షలు ఉంటే కోట్లు ఎలా వచ్చాయని సందేహం వ్యక్తం చేశారు. అంజలి వెనుక ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నారని ఆమె సందేహం వ్యక్తం చేశారు. అంజలి తల్లి, తన సోదరి గల్ఫ్ లో ఉంటారని, ఆమెతో తనకు సంబంధాలు కొనసాగుతున్నాయని భారతీదేవి వెల్లడించారు. అంజలిని వేధించి ఉంటే ఎటువంటి శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు.ప్రస్తుతం అంజలి ఆచూకీ లేదని తమకు ఆందోళనగా ఉందన్నారు.