: సర్జరీ చేసి ప్రాణం కాపాడిన ఎమ్మెల్యే


ఆయన ఎమ్మెల్యే... అంతకంటే ముందు ఆయనో డాక్టర్. అందుకే ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న ఓ రోగికి సర్జరీ చేసి కొత్త జీవితాన్నిచ్చారు. ఆయనే మదనపల్లె ఎమ్మెల్యే తిప్పారెడ్డి. కడుపులో పేగు కుళ్లిపోయిన స్థితిలో మదనపల్లె ఏరియా ఆస్పత్రికి వచ్చిన రెడ్డి శ్రీవల్లి అనే 13 ఏళ్ల బాలికకు సర్జరీ చేయడానికి ప్రభుత్వ వైద్యులకు ధైర్యం చాల్లేదు. ఎక్కువ రిస్కు ఉండడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ స్థానిక ఎమ్మెల్యే తిప్పారెడ్డికి విషయం తెలిపారు. వృత్తి రీత్యా జనరల్ సర్జన్ అయిన తిప్పారెడ్డి ముందుకు వచ్చి బాలికకు సర్జరీ చేశారు. కుళ్లిపోయిన పేగును తొలగించారు.

  • Loading...

More Telugu News