: అధికారులకు చుక్కలు చూపించిన చంద్రబాబు... కిందపడ్డ ఎమ్మెల్యే సత్యప్రభ
తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన (రెండో రోజు) కొనసాగుతోంది. పర్యటనలో తనదైన శైలిలో అధికారులకు ఆయన చుక్కలు చూపిస్తున్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న పనితీరును దగ్గరుండి పరిశీలించారు. చంద్రబాబు అడిగిన ప్రశ్నలకు అధికారులు నీళ్లు నమిలారు. అధికారుల పనితీరు సరిగాలేదని గుర్తించిన ఆయన... వారిపై మండిపడ్డారు. పనితీరును మార్చుకోలేకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అనంతరం చంద్రబాబుకు వందలాది మంది ప్రజలు వినతి పత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా అక్కడ చిన్నపాటి తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎమ్మెల్యే సత్యప్రభ అదుపుకోల్పోయి కిందపడ్డారు.