: ఆంధ్రప్రదేశ్ కు 10 మంది ప్రొబేషనరీ ఐఏఎస్ లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2013 బ్యాచ్ కి చెందిన 10 మంది ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులను కేటాయించారు. శ్రీకాకుళం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా అద్వైత్ కుమార్ సింగ్, విశాఖ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా హిమాంశు శుక్లా, తూర్పుగోదావరి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా శశాంక, పశ్చిమ గోదావరి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా రవి సుభాష్, కృష్ణాజిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా శ్రీజన, గుంటూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా శివశంకర్, ప్రకాశం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా మోహన్, కర్నూలు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా లక్ష్మీషా, చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా శ్రుతి ఓజా, అనంతపురం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా విజయ నియమితులయ్యారు.