: డీఎంకే పార్టీకి ఖుష్బూ రాజీనామా
ప్రముఖ తమిళ నటి ఖుష్బూ డీఎంకే పార్టీకి రాజీనామా చేశారు. చెన్నైలో ఖుష్బూ మాట్లాడుతూ, పార్టీ కోసం ఎంత కష్టపడ్డా తగినంత గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కాలంగా అసంతృప్తి ఉన్నా ఓపిక వహించానని తెలిపిన ఖుష్బూ... రాజీనామా నిర్ణయం కఠినమైనా తీసుకోక తప్పలేదని అన్నారు. తమిళనాట ఖుష్బూకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఆమెకు గుడి కూడా కట్టారు. పలు సందర్భాల్లో ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు, విమర్శలపై పెను దుమారం రేగినా, ఆమెకు ముక్కు సూటిగా వ్యవహరిస్తారనే పేరు ఉంది.