: అధికార బలంతో ఆర్డినెన్సు తెచ్చారు: చాడ వెంకటరెడ్డి


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆర్డినెన్సు తెచ్చి తెలంగాణ గ్రామాలను సీమాంధ్రలో కలిపారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. అధికార బలంతో ఈ ఆర్డినెన్సులు తెచ్చారని విమర్శించారు. దీన్ని వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఎలాంటి షరతులు లేకుండా రూ. లక్ష వరకు రైతు రుణాలను మాఫీ చేయాలని కోరారు. తెలంగాణలో మద్యం మాఫియాపై ఉన్న కేసుల విషయంలో తన వైఖరి ఏమిటో కేసీఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News