: మూడు వేలకే ఫ్రంట్ కెమెరాతో స్మార్ట్ ఫోన్
చవక సెల్ ఫోన్లతో మార్కెట్లో తనదైన ముద్ర వేసిన సెల్ కాన్ సంస్థ వినియోగదారులకు మరోసారి బంపరాఫర్ ప్రకటించింది. కేవలం 3 వేల రూపాయలకే ఫ్రంట్ కెమెరాతో కూడిన స్మార్ట్ ఫోన్ ను అందిస్తోంది. క్యాంపస్ ఎ35కె పేరిట సెల్ కాన్ ఆన్ లైన్ వ్యాపార సంస్థ స్నాప్ డీల్ ద్వారా అమ్మేందుకు ఒప్పందం చేసుకుంది. దీని ధరను 2,999 రూపాయలుగా నిర్ణయించింది. ఆండ్రాయిడ్ కిట్ కాట్ 4.4 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే స్మార్ట్ ఫోన్లలో ఇదే అత్యంత చవకైన ఫోన్ అని సెల్ కాన్ చెబుతోంది.
ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్, 1 గిగా హెర్ట్జ్ ప్రాసెసర్, 256 ఎంబీ ర్యామ్, 3.5 అంగుళాల డిస్ ప్లే, 3.2 మెగాపిక్సెల్ వెనుక కెమేరా, 3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 512 ఎంబీ ఇన్ బిల్ట్ మెమొరీ ఉండగా దీనిని 32 జీబీ వరకు అదనపు మెమరీ జత చేసుకోవచ్చు. వైఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్ బీ, ఏజీపీఎస్ కెనెక్టివిటీతో పాటు 3జీ కనెక్టివిటీ కూడా ఉంటుందని సెల్ కాన్ తెలిపింది.