: ఇద్దరు ట్రైనీ మహిళా క్రీడాకారులకు అమితాబ్ స్పాన్సర్ షిప్
ఐక్యరాజ్య సమితి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇద్దరు మహిళా క్రీడాకారులకు స్పాన్షర్ షిప్ ఇవ్వనున్నారు. ఈ మేరకు షూటింగ్ లో శిక్షణ తీసుకుంటున్న యువ క్రీడాకారిణిలు అయోనికా పాల్, పూజా ఘట్కర్ లకు అయ్యే ఖర్చును ఆయన భరిస్తారు. ఎన్జీవో 'ఒలంపిక్ గోల్డ్ క్వెస్ట్' మెడల్స్ ఫర్ ఇండియా ప్రచారంలో భాగంగా బిగ్ బీ వారికి సహాయాన్ని అందిస్తున్నారు. ఆ మహిళా క్రీడాకారిణులు కామన్ వెల్త్ గేమ్స్, ప్రపంచ ఛాంపియన్ షిప్స్, 2014లో జరిగే ఆసియన్ గేమ్స్ లో పాల్గొంటారు. ఆటల్లో ఆసక్తి ఉన్నవారిని గుర్తించి, అర్హులైన వారికి ఒలింపిక్స్ లో బంగారు పతకాలు సాధించే దిశగా ఈ కార్యక్రమం ద్వారా శిక్షణ ఇస్తారు.