: ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్పకు పెద్దాపురంలో ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి చినరాజప్పకు తూర్పుగోదావరిజిల్లా పెద్దాపురంలో ఘన స్వాగతం లభించింది. హోంమంత్రి అయిన తర్వాత తొలిసారి సొంత జిల్లాకు రావడంతో అందరూ అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, భూకబ్జాదారులు, స్మగ్లర్ల ఆట కట్టిస్తామన్నారు. శాంతి భద్రతలు నెలకొల్పి రామరాజ్యంగా మారుస్తామని తెలిపారు. ఈ నెల 22న హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పారు.