: టీడీపీతో పొత్తే ముంచేసింది: కిషన్ రెడ్డి
టీడీపీతో పొత్తే బీజేపీని ముంచేసిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం సందర్భంగా హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోడీ హవాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామని అన్నారు. బీజేపీ ఓటమితో సాధారణ కార్యకర్తలు కూడా నిరాశకు లోనయ్యారని ఆయన తెలిపారు. పొత్తులను నిర్ణయించేది రాష్ట్ర నాయకత్వం కాదని, అధిష్ఠానం నిర్ణయిస్తుందని అన్నారు.
మెదక్ లోక్ సభ స్ధానం నుంచి బీజేపీ పోటీచేసి విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సర్దుబాట్లలో అవకతవకలు, ఆలస్యంగా అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలు జయాపజయాలపై ప్రభావం చూపాయని ఆయన అభిప్రాయపడ్డారు.