: కాల్పులు ఆపితేనే మీతో చర్చలు: పాక్ కు స్పష్టం చేసిన జైట్లీ


ఒక వైపు మోడీ ప్రభుత్వంతో చర్చలంటూ... మరో వైపు సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం కేవలం పాక్ కు మాత్రమే సాధ్యమైంది. ఈ నేపథ్యంలో, కేంద్ర రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ పాకిస్థాన్ కు క్లియర్ మెసేజ్ పంపారు. శ్రీనగర్ లో ఆయన మాట్లాడుతూ, కాల్పుల విరమణ ఉల్లంఘనలకు తెర దించితేనే పాకిస్థాన్ తో చర్చలు ఉంటాయని... లేకపోతే ఎలాంటి చర్చలు ఉండవని తేల్చి చెప్పారు. సరిహద్దుల్లోని పరిస్థితులు సాధారణ స్థితికి రావాలంటే... ప్రతికూల చర్యలను ఆపేయాల్సిందే అని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News