: శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ నరసింహన్
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు చేరుకున్నారు. ఆయన ఇవాళ ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామిని వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో దర్శించుకున్నారు. అంతకు ముందు ఆయన ఆలయంలోని ధ్వజస్తంభానికి శిరసు వంచి నమస్కరించారు. గవర్నరుకు స్వాగతం పలికిన ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.