: మోడీ పొరబాటును వేలెత్తి చూపుతున్న సోషల్ మీడియా


ప్రధాని నరేంద్ర మోడీ చేసిన చిన్న పొరపాటు సోషల్ మీడియాను వేడెక్కించింది. భూటాన్ పర్యటనలో ఉన్న మోడీ ప్రసంగంలో దొర్లిన పొరపాటుపై సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయింది. వివరణలు, వ్యంగ్యాస్త్రాలు, కామెంట్లు, సర్దుబాట్లు, విమర్శలతో హోరెత్తుతోంది. పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ భూటాన్ పార్లమెంటులో ప్రసంగిస్తూ భూటాన్ రాజకుటుంబం బదులుగా నేపాల్ రాజకుటుంబం అని పేర్కొన్నారు. వెంటనే తన పొరబాటును గుర్తించిన మోడీ భూటాన్ రాజకుటుంబం అని సరిదిద్దుకున్నారు.

దీంతో మోడీపై సామాజిక నెట్ వర్క్స్ ఫేస్ బుక్, ట్విట్టర్లో కామెంట్లతో విమర్శలు చేస్తుండగా, మోడీ అభిమానులు సమర్థిస్తూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. సామాజిక అనుసంధాన వేదికను సమర్థవంతంగా వాడుకున్న మోడీపై సోషల్ నెట్ వర్క్ లో తొలిసారి విమర్శలు వ్యక్తమవ్వడం విశేషం.

  • Loading...

More Telugu News