: గ్రేటర్ హైదరాబాదులో త్వరలో రూపాయికే టిఫిన్


గ్రేటర్ హైదరాబాదులో త్వరలో ‘రూపాయికే టిఫిన్’ పథకాన్ని ప్రారంభించనున్నట్టు హైదరాబాద్ నగర మేయర్ మాజిద్ హుస్సేన్ తెలిపారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన నిధులు జీహెచ్ఎంసీ బడ్జెట్ లో ఉన్నాయని మేయర్ చెప్పారు. అయితే, మెనూలో ఏ ఏ పదార్థాలు ఉండాలన్న విషయంపై సమీక్షిస్తున్నామని ఆయన అన్నారు. ఇంతకు ముందు జీహెచ్ఎంసీ ‘ఐదు రూపాయలకే భోజనం’ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ పథకం విజయవంతమవడంతో ఇప్పుడు నగరంలోని పేదలకు రూపాయికే టిఫిన్ అందించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది.

  • Loading...

More Telugu News