: ఆచూకీ లేని నటి అంజలి!


కుటుంబ సమస్యలతో రోడ్డున పడ్డ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కథానాయిక అంజలి అదృశ్యమయ్యారు. ఆమె ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉంది. దీంతో ఆమె కుటంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. తన పిన్ని, తమిళ దర్శకుడు కలంజియం కలిసి తన దగ్గరున్న డబ్బంతా దోచుకున్నారని, తనను తీవ్రంగా వేధింపులకు గురి చేశారని, కనీసం ఖర్చులకు కూడా డబ్బుల్లేవని అంజలి సోమవారం మీడియాకు తన సినీ కష్టాలు వెళ్లబోసుకున్న సంగతి తెలిసిందే. అలాగే తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకేం జరిగినా తన పిన్ని, కలంజియంలదే భాధ్యతని ఆమె ప్రకటించారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలనుకుంటున్నానని చెప్చిన ఆమె ఈ ఉదయం నుంచీ అడ్రస్ లేకుండా పోవడం సంచలనం కలిగిస్తోంది.

  • Loading...

More Telugu News