: కపిల్ కామెడీ నైట్స్ మళ్లీ సరికొత్తగా
నవ్విస్తూ సాగిపోయే 'కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ' టీవీ కార్యక్రమం మళ్లీ సెప్టెంబర్ నుంచి సరికొత్తగా అభిమానుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని కపిల్ శర్మ కూడా ట్విట్టర్లో ధ్రువీకరించారు. 'కామెడీ నైట్స్ విత్ కపిల్ సెప్టెంబర్ నుంచి ప్రసారం కానుంది. సరికొత్త పాత్రలు, సెట్ తో తిరిగి రాబోతున్నాం. అప్పటి వరకూ నవ్వుతూ ఉండండి' అంటూ కపిల్ ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమం కలర్స్ చానల్ లో ప్రసారమవుతోంది. దీనికి వ్యాఖ్యాత, నిర్మాతగా కూడా కపిలే ఉన్నారు. ఇక, రెండో దశ కార్యక్రమం మొదలు పెట్టేందుకు కపిల్ కలర్స్ చానెల్ తోనూ మాట్లాడినట్లు వెల్లడించారు. టీవీ కార్యక్రమాల్లో కనిపించడం తగ్గించి, సినిమాల్లో బిజీ అయిపోవాలని కపిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కలర్స్ వారానికి రెండు సార్లు ప్రసారం అవుతుండగా, అది ఇకపై వారానికి ఒక్కరోజే ప్రసారం కానున్నట్లు సమాచారం.