: సిమెంటు ధరలు తగ్గించండి: టీ.ప్రభుత్వం
సిమెంటు ధరలు తగ్గించాలంటూ కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం సూచించింది. సిమెంటు కంపెనీల ప్రతినిధులతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ధర తగ్గించే విషయమై తాము చర్చించుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తామని సిమెంటు కంపెనీల యాజమాన్యాలు ప్రభుత్వానికి తెలియజేశాయి.