: యశ్వంత్ సిన్హాకు ఈ నెల 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ


మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా జ్యుడీషియల్ కస్టడీని జార్ఖండ్ కోర్టు ఈ నెల 28వ తేదీ వరకు పొడిగించింది. సిన్హా బెయిల్ కావాలని కోరనందున న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విద్యుత్ బోర్డు కార్యాలయంలో నిరసన ప్రదర్శన చేపట్టినందుకుగాను యశ్వంత్ సిన్హా ఈ నెల 2న అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆయనకు కోర్టు తొలుత 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ మంగళవారం నాడు జైలుకు వెళ్లి సిన్హాను కలుస్తారని బీజేపీ పార్టీ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News