: చంద్రబాబు, వెంకయ్యనాయుడు నాటకాలాడుతున్నారు: నారాయణ


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నాటకాలాడుతున్నారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. చిత్తూరులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా లేదని అన్నారు. రుణమాఫీపై చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా కొద్ది రోజులే ఉన్నాయని, బాబు ఇంకా కమిటీలతోనే కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. చుండూరు కేసుపై ప్రభుత్వమే సుప్రంకోర్టులో కేసు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. సాక్షులు లేరంటూ కోర్టు కేసును కొట్టివేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News