: బియాస్ నదిలో మృతి చెందిన విద్యార్థులకు మిస్సింగ్, డెత్ సర్టిఫికెట్లు


కొన్ని రోజుల కిందట హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో మృతి చెందిన హైదరాబాదుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆ రాష్ట్ర అధికారులు మిస్సింగ్, డెత్ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఎఫ్ఐఆర్ తో పాటు డెత్ సర్టిఫికెట్లను వారి తల్లిదండ్రులకు అందజేశారు. ఇంకా దొరకని మృత దేహాల కోసం ఆధునాతన స్కానర్లు, కెమెరాలతో గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కాగా, తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి హిమాచల్ నుంచి హైదరాబాదుకు బయలు దేరారు. అక్కడి రెస్క్యూ ఆపరేషన్ ను టీ మంత్రి మహేందర్ రెడ్డి పర్యవేక్షించనున్నారు.

  • Loading...

More Telugu News