: నాంపల్లి కోర్టుకు వైఎస్ జగన్, సబితా, గీతారెడ్డి
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి, ఆడిటర్ విజయసాయి రెడ్డి కూడా న్యాయస్థానం ముందు విచారణకు వచ్చారు. కొంతకాలంగా కొనసాగుతున్న అక్రమాస్తుల కేసులో వీరు నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే.