: వైఎస్ఆర్ 'ప్రజా ప్రస్థానం'కు నేటితో పదేళ్లు


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 'ప్రజా ప్రస్థానం' నేటితో పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే దిశగా, ఆనాటి ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఇదే రోజున వైఎస్ పాదయాత్రను చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్వహించిన యాత్రతో అధికారం 'హస్త'గతమైంది. ప్రజా ప్రస్థానం పదేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కాకినాడలో ఈరోజు రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రస్తుతం మరో ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్ కుమార్తె షర్మిల రాష్ట్రంలో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News