: రెండు హిజ్రా గ్రూపుల మధ్య ఫైట్... పలువురికి తీవ్ర గాయాలు
రెండు హిజ్రా గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం చివరకు దాడులకు దారి తీసింది. వరంగల్ లో హిజ్రాల్లోని సౌజన్య వర్గంపై లైలా వర్గానికి చెందిన 30 మంది దాడి చేశారు. ఈ దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిని వారిని చికిత్స కోసం స్థానిక ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సాధారణంగా రైళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో హిజ్రాలు మనకు తారసపడుతుంటారు. వీరి ఆగడాలు తట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది హిజ్రాల్లోని రెండు గ్రూపులు పరస్పరం దాడులకు దిగడం గమనార్హం.