: వారం రోజులుగా గాలింపు చర్యలు జరిపాం: కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు
హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో వారం రోజులుగా ముమ్మరంగా గాలింపు జరిపామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. మంత్రులు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు. టీడీపీ సమన్యాయం అంటే ఏమిటో ఆనాడు చాలా మందికి అర్థం కాలేదన్నారు. విజయనగరంలో కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ... హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో గల్లంతైన వారి కోసం వెతికేందుకు కేంద్రం కూడా సాయం చేసిందన్నారు.