: ప్రీతిజింతా ఫిర్యాదుపై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
మాజీ ప్రియుడు నెస్ వాడియాపై సినీ నటి ప్రీతిజింతా ఫిర్యాదుకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల వాంగ్మూలాన్ని ఇవాళ ముంబయి పోలీసులు రికార్డు చేశారు. తనను దుర్భాషలాడారని ఆరోపిస్తూ నెస్ వాడియాపై ప్రీతి జింతా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫిర్యాదుదారైన ప్రీతి జింతాను కూడా పోలీసులు ప్రశ్నించడానికి ప్రయత్నించగా, ఆమె అందుబాటులో లేరు. "ఈ కేసులో విచారణకు సంబంధించి ఫిర్యాదుదారు వాంగ్మూలం కూడా అవసరం. అయితే ఆమె ప్రస్తుతం అందుబాటులో లేరు" అని పోలీసులు చెప్పారు.