: అందానికి ఇప్పుడు అందరూ ప్రాముఖ్యత ఇస్తున్నారు: సినీ నటి ప్రీతి రాణా
అందానికి ఇప్పుడందరూ ప్రాముఖ్యత ఇస్తున్నారని సినీ నటి ప్రీతి రాణా చెప్పింది. హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని ‘బ్లష్ ఇంటర్నేషనల్ లగ్జరీ స్పా అండ్ సెలూన్’కు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా ప్రీతి రాణా మాట్లాడుతూ... స్కిన్ జెల్ ఫీలింగ్ ట్రీట్ మెంట్ ను సిటీలో తొలిసారిగా ఇక్కడ అందిస్తున్నారని చెప్పింది. సినీ పరిశ్రమలో నటులను అందంగా చూపేందుకు అంతర్జాతీయ సేవలతో కూడిన ఇలాంటి స్పాలు హైదరాబాదులో ఏర్పాటు కావడం అభినందనీయమని ఆమె చెప్పింది. నిర్వాహకులు నందినీ చౌదరి, నరేష్, వెంకట్ కార్తీక్ లు మాట్లాడుతూ... ఈ స్పాను ప్రముఖ నిర్మాత రామానాయుడు ఆవిష్కరించినట్లు చెప్పారు.